ఆ పార్టీ గుర్తులతో దోశలు..!
close

తాజా వార్తలు

Updated : 22/03/2021 11:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ పార్టీ గుర్తులతో దోశలు..!

తిరువనంతపురం: శాసనసభ ఎన్నికల వేళ కేరళలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓటర్లకు చేరువయ్యేందుకు పార్టీలు వైవిధ్యంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, కొల్లాం బీచ్‌ రోడ్‌లోని ఓ హోటల్‌ యజమాని మాత్రం గిరాకీ పెంచుకునేందుకు ఎన్నికలనే మార్గంగా చేసుకున్నారు. ప్రధాన పార్టీల గుర్తులతో అల్పాహారం తయారు చేస్తూ గిరాకీ పెంచుకుంటున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అల్పాహార ప్రియులను మరింత ఆకట్టుకునేలా రాజకీయపార్టీ గుర్తులతో దోశలను తయారు చేస్తున్నారు. ప్రధాన పార్టీలైన సీపీఎం, కాంగ్రెస్‌, భాజపా గుర్తులతో ఈ దోశలు వేస్తున్నారు. దోశలపై పార్టీ గుర్తులను వేసేందుకు క్యారెట్‌ ముక్కలు, టొమాటో సాస్‌ వాడుతున్నారు. ఈ వినూత్న దోశలకు ఎన్నికల వేళ డిమాండ్‌ పెరిగిందని, గతం కన్నా ఎక్కువ ఆర్డర్లు వస్తున్నట్లు హోటల్ యజమాని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని