వైద్యుడి చాకచక్యం.. 270 మందికి తప్పిన ప్రాణగండం
close

తాజా వార్తలు

Published : 17/05/2021 01:32 IST

వైద్యుడి చాకచక్యం.. 270 మందికి తప్పిన ప్రాణగండం

ముంబయి: రెండో విడత కరోనా విజృంభణతో దేశంలో ప్రాణవాయువుకు తీవ్ర కొరత ఏర్పడింది. మహారాష్ట్ర జలగావ్‌లోని ఓ ఆస్పత్రిలో గురువారం(ఈ నెల 13న) రాత్రి ఆక్సిజన్‌ ట్యాంకు నిండుకునేందుకు సమయం దగ్గరపడింది. సకాలంలో ట్యాంకర్లు ఆస్పత్రికి చేరుకోలేకపోయాయి. ఈ తరుణంలో చాకచక్యంగా వ్యవహరించారు అక్కడి ఆక్సిజన్‌ నిర్వహణ వైద్యులు. కొద్దిపాటి ఆక్సిజన్‌ను అందరికీ సరఫరా చేసి.. సుమారు 270 మంది కొవిడ్‌ బాధితులను కాపాడింది డాక్టర్‌ సందీప్‌ పటేల్‌ నేతృత్వంలోని బృందం.

ఈ నెల 13న సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ప్రభుత్వ వైద్య కశాశాలలో ఉన్న 20 కిలోలీటర్ల ఆక్సిజన్‌ అయిపోయేందుకు సమయం దగ్గర పడింది. ఈ సందర్భంలో ఎలాంటి ఆందోళనకు గురికాకుండా.. ట్యాంకర్‌ అయిపోవడానికి 10 నిముషాల ముందే 100 ఆక్సిజన్‌ సిలిండర్లను అమర్చింది సందీప్‌ బృందం. ఇందుకోసం సుమారు 8 గంటలు నిరంతరంగా శ్రమించారు. ఓ వైపు.. జన్మదిన వేడుకలు జరుపుకొనేందుకు.. ఇంటి నుంచి ఫోన్‌కాల్స్‌ వచ్చినా.. విధి నిర్వహణకే సందీప్‌ ప్రాధాన్యమిచ్చారు.

సుదీర్ఘ ప్రయత్నం అనంతరం.. ఆపరేషన్‌ విజయవంతం కావడం వల్ల అతడిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. తన పుట్టిన రోజు(మే 14) నాడు సైతం కుటుంబానికి దూరంగా ఉండి.. విధి నిర్వహణలో కీలకపాత్ర పోషించిన సందీప్‌ను ఆస్పత్రి డీన్‌ రామానంద్‌ ఘనంగా సత్కరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని