‘రోజూ గోమూత్రం తాగుతా.. అందుకే కొవిడ్‌ లేదు’
close

తాజా వార్తలు

Updated : 18/05/2021 04:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రోజూ గోమూత్రం తాగుతా.. అందుకే కొవిడ్‌ లేదు’

ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా వివాదాస్పద వ్యాఖ్యలు

భోపాల్‌: ఆవుపేడ, గోపంచకంతో కరోనా నయం కాదని వైద్యులు, నిపుణులు ఎన్నిసార్లు చెబుతున్నా కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం పదేపదే వీటిపై ప్రచారం చేస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న ఓ భాజపా ఎమ్మెల్యే గోమూత్రం వల్లే తనకు కరోనా రాలదని, అందరూ దీన్ని పాటించాలని చెప్పారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే భాజపా ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ కూడా ఇప్పుడే ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాను రోజూ గోపంచితం తాగుతుండటం వల్లే తనకు కరోనా లేదని ఆమె అన్నారు.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన భాజపా కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘దేశీ గోవు పంచితాన్ని మనం ప్రతిరోజూ తీసుకుంటే అది మన ఊపిరితిత్తులను కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ నుంచి కాపాడుతుంది. నేను ప్రతిరోజూ గోమూత్రాన్ని తీసుకుంటా. అందువల్ల నేను కరోనాకు ఎలాంటి ఔషధాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. దానివల్లే నాకు కరోనా లేదు’’అని చెప్పుకొచ్చారు. ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గోమూత్రం వల్లే తాను క్యాన్సర్‌ను జయించానని రెండేళ్ల క్రితం ఆమె చెప్పారు. ఇదిలా ఉండగా.. గతేడాది డిసెంబరులో కొవిడ్‌ లక్షణాలతో ఆమె దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. 

గతేడాది కరోనా విజృంభణ ప్రారంభ దశలో ఉన్న సమయంలో బెంగాల్‌ భాజపా చీఫ్‌ దిల్లీ ఘోష్‌ కూడా గోపంచకం సేవిస్తే కరోనా రాదని అన్నారు. గోమూత్రాన్ని ఒక గ్లాసు చల్లటి నీటితో తాగితే, కొవిడ్‌ నుంచి సురక్షితంగా ఉండొచ్చని ఇటీవల యూపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ వ్యాఖ్యలు చేశారు. అయితే గోపంచకం, ఆవు పేడను కరోనా చికిత్సలో ఉపయోగించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని, అలాంటి ప్రయోగాలు ఎవరూ చేయొద్దని భారత వైద్య మండలి హెడ్‌ డాక్టర్‌ జయలాల్‌ ఇటీవల స్పష్టం చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని