close

తాజా వార్తలు

Updated : 18/01/2021 14:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బైక్‌ అంబులెన్స్‌ రూపొందించిన డీఆర్డీవో

హైదరాబాద్‌ : మావోయిస్టు ప్రభావిత, కొండ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో వినియోగం కోసం సీఆర్పీఎఫ్‌తో కలిసి బైక్ అంబులెన్స్‌ను డీఆర్డీవో రూపొందించింది. దాడి లేదా ప్రమాదం జరిగిన సందర్భంలో ఘటన ప్రదేశం నుంచి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ బైక్‌ను రూపొందించినట్లు డీఆర్డీవో తెలిపింది.

సిబ్బంది విధులు నిర్వహిస్తున్న అన్ని ప్రదేశాల్లో ఈ బైక్‌లు  వినియోగించనున్నట్లు సీఆర్పీఎఫ్‌ వెల్లడించింది. విధులు నిర్వహించే ప్రదేశాల్లో సాధారణ ప్రజల కోసం కూడా వీటిని ఉపయోగించనున్నట్లు తెలిపింది. గత కొన్ని రోజులుగా పలు చోట్ల ప్రయోగాత్మకంగా వీటిని పరీక్షించారు. సీఆర్పీఎఫ్ సూచనల మేరకు ఈ బైక్ అంబులెన్స్‌ను రక్షణ పరిశోధన సంస్థ తయారుచేసింది.

ఇవీ చదవండి..
పటిష్ఠ పహారాలో అమెరికా!

టీకా పంపిణీలో భారత్‌ ప్రపంచ రికార్డ్‌!




Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని