
తాజా వార్తలు
యూట్యూబ్ నటితో డ్రైవర్ అసభ్య ప్రవర్తన
జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: యూట్యూబ్ నటితో అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై రవిరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌కు చెందిన ఓ యువతి(32) యూట్యూబ్‌లో నటి. ఈ నెల 13న ఆమె కేరళలోని పద్మనాభస్వామిని దర్శించుకునేందుకు అక్కడికి వెళ్లింది. యువతితో పాటు ఆమె డ్రైవర్ షేక్ ఇబ్రహీం వెళ్లాడు. కాగా ఇబ్రహీంకు మాదకద్రవ్యాల అలవాటు ఉందని, అతను సమయానికి ఆ డ్రగ్ తీసుకోకపోవడంతో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని శనివారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి..
కనిపెంచిన చేతులే.. కాటేశాయి
చూస్తే పిజ్జా ప్యాక్.. విప్పితే మెథకొలైన్
Tags :