జగన్నాటకానికి తెరతీశారు: ధూళిపాళ్ల
close

తాజా వార్తలు

Updated : 17/03/2021 12:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జగన్నాటకానికి తెరతీశారు: ధూళిపాళ్ల

అమరావతి: రాజధాని భూముల విషయంలో వైకాపా నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. రాజధానిలో ఎస్సీ, ఎస్టీలకు ఎక్కడా అన్యాయం జరగలేదని స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని పెద్ద ఎత్తున అసత్య ప్రచారం చేశారు. అమరావతి భూముల విషయంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు అవకాశం లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అసత్యాలు ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. బాధితులు ఫిర్యాదు ఇవ్వకుండా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేస్తే సీఐడీ అధికారులు కేసునమోదు చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎస్సీనా? . ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా నమోదు చేస్తారు?. కొత్త జగన్నాటకానికి ఆర్కే తెర తీశారు. అమరావతిలో ఎస్సీలు ముందుండి ఉద్యమం నడిపిస్తున్నారు. దేశంలో ఎక్కడ భూ సేకరణ జరిగినా ఆందోళనలు జరిగాయి... కానీ ఆమరావతిలో రైతులు స్వచ్ఛందంగా  33వేల ఎకరాలు ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వరకూ జీవో 41 తప్పు అని చెప్పని వైకాపా నాయకులు ఇవాళ విమర్శలు చేయడం దారుణం’’ అని నరేంద్ర అన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని