close

తాజా వార్తలు

Published : 02/05/2021 10:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆధిక్యాల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేశాయ్‌..!

బెంగాల్‌/చెన్నై: నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల సరళిని చూసినట్లయితే తమిళనాడులో అధికార మార్పిడి జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌, కేరళ, అస్సాంలో అధికార పార్టీల హవానే కొనసాగుతోంది. పుదుచ్చేరీలో కాంగ్రెస్‌, భాజపా మధ్య గట్టి పోటీ నెలకొంది.

బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆధిక్యంలో మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటింది. అక్కడ మొత్తం 292 నియోజకవర్గాల ఫలితాలు వెలువడుతుండగా.. టీఎంసీ ప్రస్తుతం 154 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. భాజపా 96 స్థానాలతో రెండో స్థానంలో ఉంది. ఇక తమిళనాడులో డీఎంకే కూటమి జోరు ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 234 నియోజకవర్గాలుండగా ప్రస్తుతం ఈ కూటమి 133 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. అధికార అన్నాడీఎంకే కూటమి 95 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

కేరళలో అధికార ఎల్‌డీఎఫ్‌ కూటమి హవా సాగిస్తోంది.  మొత్తం 140 స్థానాలకు గానూ.. ఈ కూటమి 87 చోట్ల ముందంజలో కొనసాగుతోంది. ప్రతిపక్ష యూడీఎఫ్‌ 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అస్సాంలో మొత్తం 126 స్థానాలకు గానూ.. అధికార భాజపా కూటమి 72 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్‌ 40 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. పుదుచ్చేరిలో భాజపా 12 చోట్ల, కాంగ్రెస్‌ కూటమి 5 చోట్ల ముందంజలో ఉంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని