close

తాజా వార్తలు

Published : 01/03/2021 10:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తూర్పు నౌకాదళం.. సవాళ్లకు సిద్ధం: ఎ.బి.సింగ్‌

విశాఖ: తూర్పు నౌకాదళం ఎలాంటి సవాళ్లకైనా సిద్ధంగా ఉందని తూర్పు నౌకాదళాధిపతిగా నూతన బాధ్యతలు చేపట్టిన వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్‌ అన్నారు. విశాఖలోని ఐఎన్‌ఎస్‌ సర్కార్స్‌ మైదానంలో ఆయన ఇవాళ బాధ్యతల స్వీకరించారు. బదిలీపై దిల్లీకి వెళుతున్న ఎ.కె.జైన్‌ నుంచి ఎ.బి.సింగ్ ఈ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎ.కె.జైన్‌ నౌకాదళ వివిధ యూనిట్ల నుంచి వీడ్కోలు వందనాన్ని స్వీకరించారు. పరేడ్‌ను నూతన తూర్పు నౌకదళాధిపతి వైస్‌ అడ్మిరల్ ఎ.బి.సింగ్‌ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎ.బి.సింగ్‌ మాట్లాడుతూ దేశ భద్రత పరిరక్షణలో నౌకాదళ పాత్ర తిరుగులేనిదన్నారు. పాక్‌పై సాధించిన విజయానికి 50 వసంతాలు పూర్తయ్యాయని వివరించారు. ఆపరేషన్‌ పవన్‌ శ్రీలంకలో విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. సామర్థ్యాలు, పోరాట పాటవాలను నవీకరించుకుంటున్నామన్నారు. మన సముద్ర తీరాన్ని, జలాలను రక్షించుకునే విషయంలో రాజీలేని పోరాటం చేస్తామని వివరించారు. సముద్రతీరంలో ఉన్న జిల్లాల యంత్రాంగాలు, రాష్ట్ర ప్రభుత్వాలతో విశాఖ తూర్పు నౌకాదళం సమన్వయం చేసుకుంటుందని నూతన తూర్పు నౌకాదళాధిపతి స్పష్టం చేశారు. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని