ఇప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండవు: ఈసీ
close

తాజా వార్తలు

Published : 14/05/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండవు: ఈసీ

దిల్లీ: కరోనా వైరస్‌ తీవ్రత దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండవని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. కొవిడ్‌ ఉద్ధృతి తగ్గేవరకు ఏపీ, తెలంగాణలోని 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరపలేమని వెల్లడించింది. ఈ మేరకు ఈసీ ప్రకటన విడుదల చేసింది. పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే నిర్వహిస్తామని తెలిపింది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఖాళీలపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఆ లేఖపై చర్చించిన ఈసీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించరాదనే అభిప్రాయానికి వచ్చింది. తెలంగాణలో 6, ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని