ఎన్నికల ముందు బెంగాల్‌ డీజీపీ బదిలీ
close

తాజా వార్తలు

Published : 10/03/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్నికల ముందు బెంగాల్‌ డీజీపీ బదిలీ

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర డీజీపీ వీరేంద్రను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఆయన స్థానంలో 1987 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి పి.నీరజ్‌ నయన్‌ను నియమించింది. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా రాష్ట్రంలోని పరిస్థితిని సమీక్షించిన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ కార్యదర్శి రాకేశ్ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. వీరేంద్రకు ఎలాంటి బాధ్యతలూ అప్పగించలేదు. బెంగాల్‌లో ఈ నెల 27 నుంచి ఏప్రిల్‌ 29 వరకు ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని