ఘనశ్యామ్‌ జ్యువెలర్స్‌ ప్రీత్‌కుమార్‌ అరెస్ట్‌
close

తాజా వార్తలు

Published : 12/03/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఘనశ్యామ్‌ జ్యువెలర్స్‌ ప్రీత్‌కుమార్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌: బంగారం అక్రమ రవాణా కేసులో ఘనశ్యామ్‌ జ్యువెలర్స్‌ యజమాని కుమారుడు ప్రీత్‌కుమార్‌ అగర్వాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్‌ చేసింది. ఎగుమతి చేసే బంగారం విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు ఆయనపై అభియోగాలు ఉన్నాయి. కోల్‌కతా విమానాశ్రయంలో 2018లో బంగారం స్వాధీనం చేసుకున్నారు. 250కిలోల పసిడిని అక్రమంగా మళ్లించినట్లు డీఆర్‌ఐ కేసు నమోదు చేసింది. ఆ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. హైదరాబాద్‌లోని ఐదు ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిపింది. పెద్ద  ఎత్తున హవాలా లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు సోదాల్లో గుర్తించారు.  అక్రమార్జనతో ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రీత్‌కుమార్‌ అగర్వాల్‌ను అరెస్ట్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని