నాయిని అల్లుడు శ్రీనివాస్‌రెడ్డికి ఈడీ సమన్లు
close

తాజా వార్తలు

Published : 12/04/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాయిని అల్లుడు శ్రీనివాస్‌రెడ్డికి ఈడీ సమన్లు

హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన ఐఎంఎస్‌ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయిని మాజీ వ్యక్తిగత కార్యదర్శి ముకుందరెడ్డి, ఆయన బంధువు వినయ్‌రెడ్డి, ఐఎంఎస్‌ కుంభకోణం ప్రధాన సూత్రధారి డా.దేవికారాణిలకు ఈడీ సమన్లు జారీ చేసింది. పది రోజుల్లో విచారణకు హాజరుకావాలని వారిని ఆదేశించింది. 

ఈ కుంభకోణంలో శ్రీనివాస్‌రెడ్డి, ముకుందరెడ్డి కీలకపాత్ర పోషించినట్లు భావిస్తున్న ఈడీ.. డొల్ల ఫార్మా కంపెనీల నిర్వాహకుడు బుర్ర ప్రమోద్ రెడ్డి కంపెనీల వెనుక నేతల ప్రమేయంపై ఆధారాలు సేకరిస్తోంది. ఐఎంఎస్‌ స్కాంతో నగలు, ఆస్తులు కూడబెట్టుకున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. అక్రమ సొమ్ముతో కూడబెట్టిన ఆస్తులను అటాచ్‌ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ వ్యవహారంలో ఏసీబీ కేసుల ఆధారంగా మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఈడీ దర్యాప్తు చేస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని