వికటించిన వైద్యం..8 మంది మృతి
close

తాజా వార్తలు

Published : 07/05/2021 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వికటించిన వైద్యం..8 మంది మృతి

బిలాస్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. హోమియో వైద్యం వికటించి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురు స్థానిక ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. వీళ్లంతా డ్రోసెరా 30 అనే ఔషధం తీసుకోగా.. అందులో 91 శాతం నాటుసారా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

బాధితులకు ఔషధం ఇచ్చిన వైద్యుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం విచారాణకు ఆదేశించింది. డ్రెసెరా 30 ఔషధాన్ని అనేక అనారోగ్య సమస్యలకు ఉపయోగిస్తారు. గొంతునొప్పి, దగ్గు, శ్వాసకోశ సమస్యలు, కీళ్ల నొప్పుల నివారణకు దీన్ని వాడతారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని