close

తాజా వార్తలు

Updated : 24/07/2020 14:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

షారుఖ్‌ గ్రీన్‌సిగ్నల్‌ కోసం 18 కథలు!!

మంబయి: షారుఖ్‌ ఖాన్‌ నుంచి సినిమా వచ్చి చాలా రోజులైంది. 2018లో వచ్చిన ‘జీరో’ తర్వాత ఆయన్నుంచి సినిమా రాలేదు. ఆ సినిమా కూడా విజయవంతం కాలేదు. దాని తర్వాత సోనమ్‌కపూర్, దుల్కర్‌ సల్మాన్‌ నటించిన ‘జోయా ఫ్యాక్టర్‌’లో షారుఖ్‌ వాయిస్‌ ఓవర్‌ చెప్పారు. అంతే మళ్లీ షారుఖ్‌ నుంచి మరో కొత్త సినిమా ఊసే లేదు. అంతకుముందు వచ్చిన ‘జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌’, ‘రయీస్‌’, ‘డియర్‌ జిందగీ’..ఇలా వరుస ఫ్లాపులే. దీంతో షారుఖ్‌ కథలపై ఆచితూచి వ్యవహరించే పనిలో పడ్డారు.

తన వద్దకు వచ్చే ప్రతి కథను జాగ్రత్తగా వినడం, వాటికి మార్పులు చేర్పులు చెప్పడంతో ఆయన కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కడానికి సమయం పట్టింది. ఒకటి రెండు ప్రాజెక్టులు సెట్స్‌పైకి వెళదాం అనుకున్న సమయంలో కరోనా ప్రభావంతో అవీ ఆగిపోయాయి. కానీ షారుఖ్‌ కథలపై గట్టిగానే కసరత్తు చేస్తున్నారు. దాదాపు 18 కథలు ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ కోసం ఎదురుచూస్తున్నాయట. అందులో షారుఖ్‌ నటించేవాటితో పాటు ఆయన నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో నిర్మించేవి ఉన్నాయి.

రాజ్‌ కుమార్‌ హిరాణీ, సిద్ధార్థ్‌ ఆనంద్, రాజ్‌ అండ్‌ డీకే, అట్లీ, తిగ్మన్షు దులియా, అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ, మధుర బండార్కర్, అలీ అబ్బాస్‌ జాఫర్, అమర్‌ కౌశిక్, స్మిత్‌ అమిన్‌ ఇలా దర్శకులందరూ షారుఖ్‌తో సినిమాలు చేయడానికి కథలు సిద్ధం చేసుకున్నారు. మధుర్‌ బండార్కర్‌ ఇసుక మాఫియాపై, రాజ్‌కుమార్‌ హిరాణీ పంజాబ్, కెనడా నేపథ్యంలో ఓ కథను, అట్లీ ఓ యాక్షన్‌ కథను షారుఖ్‌ కోసం సిద్ధం చేశారట. అలీ అబ్బాస్‌ జాఫర్‌ ఓ బయోపిక్‌ను వినిపించారట. వీటితో పాటు కొన్ని వెబ్‌ సిరీస్‌లకు సంబంధించినవి షారుఖ్‌ ముందు ఉన్నాయి. మరి వీటిలో ఏది ముందు మొదలవుతోందో కొన్ని రోజుల్లో వెల్లడించే అవకాశాలున్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.