ఈసీ.. ఆ నమ్మకాన్ని వమ్ము చేసింది: శివసేన
close

తాజా వార్తలు

Published : 15/04/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈసీ.. ఆ నమ్మకాన్ని వమ్ము చేసింది: శివసేన

ముంబయి: పశ్చిమ్‌బెంగాల్‌ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆమెకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని శివసేన ఆరోపించింది. ఈసీ వంటి రాజ్యాంగ బద్ధమైన సంస్థలు రాజకీయ ప్రయోజనాల కోసం పని చేయకూడదని విమర్శించింది. ఈ మేరకు శివసేన తన అధికార పత్రిక సామ్నాలో ఈసీ చర్యలను ఖండించింది.

‘పశ్చిమ్‌బెంగాల్‌ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీపై ఈసీ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. కాబట్టి మేం ఈసీకి చేతులు జోడించి ఓ విషయాన్ని అడగదలచుకున్నాం. వారు ఒక భాజపాను మాత్రమే కాకుండా అందరినీ సమానంగా చూడాలి. తారతమ్యాలు ఉండకూడదు. చట్టం ముందు అందరూ సమానమే అనే విశ్వాసాన్ని బెంగాల్‌లో ఈసీ వమ్ము చేసింది. బెంగాల్‌ విప్లవకారుల భూమి అని మరచిపోయినట్లుంది. ఏదేమైనప్పటికి, ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా మమతా బెనర్జీ ఒంటరిగా నిర్వహించిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. బెంగాల్‌లో కేంద్ర బలగాలను మోహరించినపుడు అల్లర్లను అదుపు చేయాల్సింది పోయి, కాల్పులకు తెగబడటం ఆందోళనకర పరిణామం. ఆ హింసకు కేంద్రమే బాధ్యత వహించాలి’ అని సామ్నా ఎన్నికల కమిషన్‌పై విమర్శలు గుప్పించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని