close

తాజా వార్తలు

Updated : 13/02/2021 22:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మదనపల్లెలో ఉద్రిక్తం.. నిలిచిన కౌంటింగ్‌

మదనపల్లె: చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం కోళ్లబైలులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్‌ ముగిసిన తర్వాత బ్యాలెట్‌ పెట్టెలను గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని బైరెడ్డి కాలనీకి తరలించేందుకు ఎన్నికల అధికారులు యత్నించారు. ఈ క్రమంలో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌, ఇంటర్నెట్‌ సమస్య కారణంగా బ్యాలెట్‌ బాక్సులు మరోచోటుకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగితపు బ్యాలెట్‌ పేపర్ల లెక్కింపునకు అంతర్జాలం ఎందుకని అధికారులతో గ్రామస్థులు వాదనకు దిగారు. ఎప్పటిలాగే తమ గ్రామంలోనే కౌంటింగ్‌ జరపాలంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో ఇప్పటికీ అక్కడ కౌంటింగ్‌ మొదలు కాలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న మదనపల్లె డీఎస్పీ పరిస్థితిని సమీక్షించి గ్రామస్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సాధ్యమైనంత తొందరగా కౌంటింగ్‌ ప్రక్రియను పూర్తి చేసేలా ఎన్నికల అధికారులతో పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. 

ఎట్టకేలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం

గ్రామంలోనే ఓట్ల లెక్కింపు చేపట్టాలని గ్రామస్థులు అధికారులను పట్టుబట్టారు. అయితే ఇక్కడ లెక్కించడం సాధ్యం కాదని, ముందుగా నిర్ణయించిన ప్రకారం ఓట్లను లెక్కిస్తామని చెప్పిన అధికారుల మాటలను గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో రాత్రి 8 గంటల సమయంలో మదనపల్లి సబ్‌కలెక్టర్‌ జాహ్నవి, అడిషనల్ ఎస్పీ రిషాంత్‌ గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్థులతో మాట్లాడి ఓట్ల లెక్కింపు పకడ్బందీగా చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పంచాయతీ కేంద్రం నుంచి భారీ బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సులను భయ్యారెడ్డి కాలనీ పోలింగ్ కేంద్రానికి తరలించారు. రాత్రి 9.10 నిమిషాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. 

ఇవీ చదవండి..

ఏపీ పంచాయతీ: ముగిసిన రెండో దశ పోలింగ్‌

తల్లికి భయపడి... అత్యాచార నాటకం



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని