సల్మాన్‌కు విలన్‌గా ఇమ్రాన్‌హష్మీ?
close

తాజా వార్తలు

Published : 13/02/2021 11:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సల్మాన్‌కు విలన్‌గా ఇమ్రాన్‌హష్మీ?

ముంబయి: బాలీవుడ్‌ తెరపై కొందరు హీరోలు విలన్‌ పాత్రలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా సల్మాన్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘టైగర్‌3’ చిత్రంలో ప్రముఖ నటుడు ఇమ్రాన్‌హష్మీ విలన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్‌ ఆ పాత్రకు ఇమ్రాన్ అయితేనే న్యాయం చేస్తాడని భావిస్తోందట. విభిన్నమైన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఇమ్రాన్‌ హష్మీ తొలిసారి సల్మాన్‌తో నటిస్తుండటం ఆసక్తి రేపుతోంది. ‘టైగర్‌3’ చిత్రాన్ని మహేష్‌శర్మ తెరకెక్కిస్తుండగా కత్రినాకైఫ్‌ సల్మాన్‌ సరసన నటిస్తోంది. రా ఏజెంట్‌ బ్యాక్‌డ్రాప్‌తో సుమారు రూ.350 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. మార్చి నుంచి ముంబయిలో యస్‌ఆర్‌ఏఫ్‌ స్టూడియోలో చిత్ర షూటింగ్‌ మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఈ సీక్వెల్‌లో విడుదలైన ‘ఏక్‌ థా టైగర్‌’, ‘టైగర్‌ జిందాహై’ సినిమాలు మంచి విజయాన్నందుకున్న సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి!

15 + 50 = అధికారికం

ఆ క్రేజీ సీక్వెల్‌లో విలన్‌గా?

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని