IPL ఆడిన ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు విశ్రాంతి
close

తాజా వార్తలు

Published : 18/05/2021 22:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPL ఆడిన ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు విశ్రాంతి

ఇంటర్నెట్‌డెస్క్‌: వచ్చే నెల 2 నుంచి న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు మంగళవారం 15 మంది క్రికెటర్లను ఎంపిక చేసింది. అయితే, ఇటీవల ఐపీఎల్‌లో పాల్గొన్న ఆటగాళ్లకు మాత్రం విశ్రాంతినిచ్చింది. మెగా టీ20 లీగ్‌లో స్టార్‌ ఆటగాళ్లుగా పేరున్న జోస్‌ బట్లర్‌, జానీ బెయిర్‌స్టోలను సైతం ఎంపిక చేయకపోవడం గమనార్హం. అలాగే గాయాల బారిన పడిన జోఫ్రా ఆర్చర్‌, బెన్‌స్టోక్స్‌ను సైతం ఈసీబీ పక్కన పెట్టింది.

ఇటీవల బయో బుడగలో కరోనా కేసుల కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన కీలక ఆటగాళ్లంతా అన్ని జట్ల తరఫున ఆడిన సంగతి తెలిసిందే. అందులో మొయిన్‌ అలీ, బెయిర్‌స్టో, బట్లర్‌, సామ్‌ కరన్‌, క్రిస్‌వోక్స్‌, టామ్‌కరన్‌, ఇయాన్‌ మోర్గాన్‌ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. వీరంతా స్వదేశానికి తిరిగొచ్చాక క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఈ క్రమంలోనే కివీస్‌తో టెస్టు మ్యాచ్‌లకు వారికి విశ్రాంతి ఇచ్చినట్లు ఓ ఈసీబీ వెల్లడించింది. అనంతరం కొద్ది రోజుల్లో ఆయా ఆటగాళ్లంతా ఇంగ్లిష్‌ కౌంటీల్లో పాల్గొంటారని చెప్పింది. ఇక న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు జేమ్స్‌ బ్రాసీ, ఓలీ రాబిన్‌సన్‌ను ఎంపిక చేసినట్లు చెప్పింది.

ఇంగ్లాండ్‌ ఎంపిక చేసిన ఆటగాళ్లు:
జో రూట్‌(కెప్టెన్‌), జేమ్స్‌ ఆండర్సన్‌, జేమ్స్‌ బ్రాసీ, స్టువర్ట్‌బ్రాడ్‌, రోరీ బర్న్స్‌, జాక్‌ క్రాలే, బెన్‌ఫోక్స్‌, డాన్‌ లారెన్స్‌, జాక్‌ లీచ్‌, క్రేగ్‌ ఓవర్టన్‌, ఓలీ పోప్‌, ఓలీ రాబిన్‌సన్‌, డామ్‌సిబ్లీ, ఓలీ స్టోన్‌, మార్క్‌వుడ్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని