టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌
close

తాజా వార్తలు

Updated : 26/03/2021 13:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: పుణె వేదికగా మరికాసేపట్లో టీమ్‌ఇండియా‌తో తలపడే రెండో వన్డేలో ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే తొలి వన్డేలో ఓటమిపాలైన ఆ జట్టు ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కోహ్లీసేన ఈ మ్యాచ్‌లోనూ గెలుపొందాలని పట్టుదలగా ఉంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఈరోజే సొంతం చేసుకోవాలని టీమ్ఇండియా భావిస్తోంది. ఇక ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ చేతికి గాయమవడంతో అతడి స్థానంలో జోస్‌బట్లర్‌ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా శ్రేయస్‌కు బదులు రిషభ్‌పంత్‌ను తుది జట్టులోకి తీసుకుంది.

భారత జట్టు: రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, కుల్‌దీప్‌ యాదవ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, శార్దూల్‌ ఠాకూర్‌, భువనేశ్వర్‌

ఇంగ్లాండ్‌ జట్టు: జేసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌స్టో, జోస్‌ బట్లర్(కెప్టెన్‌)‌, బెన్‌స్టోక్స్‌, డేవిడ్‌ మలన్‌, లివింగ్‌స్టన్‌, అదిల్‌ రషీద్‌, టామ్‌కరన్‌, సామ్‌ కరన్‌, మోయిన్‌ అలీ, టాప్లీ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని