తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా
close

తాజా వార్తలు

Published : 01/07/2020 01:13 IST

తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌ : తెలంగాణలో ప్రవేశ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీంతో రేపటి నుంచి జరగాల్సిన ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎంసెట్‌, పాలిసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌, పీజీ ఈసెట్‌, లాసెట్‌, పీజీ ఎల్‌ సెట్‌, ఎడ్‌సెట్‌, పీఈ సెట్‌ వాయిదా పడ్డాయి.

తెలంగాణలో రేపట్నుంచి జరగాల్సిన ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని, ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా వేయాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ పెట్టే అవకాశాలపై స్పష్టత ఇవ్వాలని ఏజీని కోరింది. హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విధిస్తే పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. పిటిషన్‌పై విచారణ జరపాలంటే లాక్‌డౌన్‌పై స్పష్టత ఇవ్వాలని సూచించింది.

లాక్‌డౌన్‌ కేబినెట్‌ నిర్ణయంపై ఆధారపడి ఉందని ఈ సందర్భంగా ఏజీ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో కేబినెట్‌ సమావేశం ఉందని వెల్లడించారు. ప్రవేశ పరీక్షల వాయిదాపై సీఎస్‌తో చర్చించి మధ్యాహ్నం నిర్ణయం చెబుతామని ఏజీ తెలిపారు. దీంతో విచారణ మధ్యాహ్నం  2.30కి వాయిదా పడింది. ఆ తర్వాత ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది. పరీక్షల తేదీలను తర్వాత వెల్లడిస్తామని తెలిపింది. జులై 4, 11, 12న జరగాల్సిన టైప్‌ రైటింట్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు ఇంజినీరింగ్‌ చివరి సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించే ఆలోచన లేదని జేఎన్టీయూహెచ్‌ కోర్టుకు వెల్లడించింది. చివరి 2 సెమిస్టర్ల మార్కుల సరాసరితో గ్రేడింగ్‌ ఇవ్వాలని సిఫారసు చేశామని తెలిపింది. ఉన్నత విద్యామండలి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. దీంతో యూజీ, పీజీ పరీక్షలపై వచ్చే నెల 9లోగా స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి, జేఎన్టీయూహెచ్‌ను కోర్టు ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని