close

తాజా వార్తలు

Published : 05/03/2021 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈటీవీ భారత్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

హైదరాబాద్‌: విశ్వసనీయమైన వార్తలకు మారుపేరైన రామోజీ గ్రూప్‌ ఈటీవీ భారత్‌ను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. న్యూస్‌ లిటరసీ విభాగంలో సౌత్‌ ఏషియన్‌ డిజిటల్‌ మీడియా అవార్డు లభించింది. ఈటీవీ భారత్‌ ఒకే యాప్‌లో దేశంలోని 28 రాష్ట్రాల తాజా వార్తలను ఎప్పటికప్పుడు అందిస్తూ డిజిటల్‌ మీడియాలో దూసుకుపోతోంది. డిజిటల్‌ విద్యలో పేదలు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు, సంపన్న కుటుంబాల పిల్లలకు మధ్య వ్యత్యాసానికి సంబంధించిన కథనాన్ని ప్రచురించినందుకు గానూ ఈటీవీ భారత్‌కు ఈ గౌరవం దక్కింది. కరోనా కాలంలో ఆన్‌లైన్‌ విద్యాబోధన కారణంగా పేద, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ఇంటర్నెట్‌ సౌకర్యం లేక ఆన్‌లైన్‌ తరగతులకు హాజరుకాలేకపోయిన పిల్లల గురించి ఈటీవీ భారత్‌ ప్రత్యేకంగా కథనాలు అందించింది. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని