ఉన్నావ్‌ అత్యాచార దోషి భార్యకు భాజపా టికెట్
close

తాజా వార్తలు

Updated : 09/04/2021 19:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉన్నావ్‌ అత్యాచార దోషి భార్యకు భాజపా టికెట్

లఖ్‌నవూ: మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన కుల్దీప్‌ సింగ్‌ సెంగర్‌ భార్య సంగీతా సెంగర్‌కు భాజపా టికెట్ ఇచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఐదు జిల్లాల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భాజపా విడుదల చేసిన జాబితాలో ఆమె పేరు కూడా ఉంది. సంగీతా సెంగర్ 2016 నుంచి 2021 వరకు ఉన్నావ్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా ఫతేపూర్ చౌరాసి త్రితయా జిల్లా పంచాయతీ వార్డు తరఫున పోటీ చేసేందుకు ఆమెకు టికెట్ లభించింది. మరోవైపు, అత్యాచారం కేసులో దోషిగా తేలిన కుల్దీప్‌ భాజపా నుంచి బహిష్కరణకు గురయ్యారు. తన ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోయి, ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో 2017లో జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మైనర్ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారనే కేసు విచారణలో ఉండగానే.. పోలీసు కస్టడీలో ఆమె తండ్రి మృతి చెందారు. ఆ తర్వాత బాధితురాలి కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా వారిపై హత్యాయత్నం జరిగింది. ఆ ఘటనలో ఆమె తన కుటుంబ సభ్యులను కూడా కోల్పోయింది. ఆమె తండ్రి మృతికేసులో దిల్లీలోని తీస్‌ హజారీ కోర్టు సెంగర్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అత్యాచార కేసులో కూడా అతనికి శిక్షపడింది. 

ఇక ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం కానున్న పంచాయతీ ఎన్నికలు నాలుగు దశల్లో జరగునున్నాయి. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి.   


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని