
తాజా వార్తలు
భాజపాలో చేరిన మాజీ మంత్రి చంద్రశేఖర్
వికారాబాద్: మాజీ మంత్రి, సీనియర్ నేత ఎ.చంద్రశేఖర్ భాజపాలో చేరారు. వికారాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరుల సమక్షంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్‌చుగ్ ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. వికారాబాద్‌ను జోగుళాంబ జోన్ నుంచి తప్పించి హైదరాబాద్ జోన్లో కలపాలని ఆయన డిమాండ్ చేశారు. వికారాబాద్‌కు వైద్య కళాశాల తీసుకురావాలన్న హామీని భాజపా ద్వారా సాధిస్తామని చెప్పారు. అయోధ్యలో నిర్మించనున్న రామ మందిరానికి ప్రతి హిందువు 10 రూపాయిలైనా జమ చేయాలన్నారు.
రాష్ట్రంలో రాబోయేది భాజపా ప్రభుత్వమే: లక్ష్మణ్
తెలంగాణలో రాబోయేది భాజపా ప్రభుత్వమేనని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. తెరాసను ఎదుర్కొనే దమ్ము భాజపాకు మాత్రమే ఉందన్న విషయం రుజువైందని చెప్పారు. తెరాసలో దళితులు, బీసీలకు గౌరవం, గుర్తింపు లేవని ఆరోపించారు. భాజపాలో మాత్రమే సామాజిక న్యాయం ఉందన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి..
ప్రశ్నించడమే వెంగయ్య చేసిన తప్పా?: పవన్
ప్రోటోకాల్ పాటించడం లేదు: ఎమ్మెల్యే రోజా