పోలీసులు నాపై కక్షగట్టారు: నల్లమిల్లి
close

తాజా వార్తలు

Updated : 13/03/2021 12:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోలీసులు నాపై కక్షగట్టారు: నల్లమిల్లి

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ఇవాళ కాకినాడ సబ్‌ జైలు నుంచి జీజీహెచ్‌కు తరలించారు. వైద్యపరీక్షల కోసం రామకృష్ణారెడ్డిని జీజీహెచ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా నల్లమిల్లి మాట్లాడుతూ ‘‘కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పోలీసులు నన్ను అరెస్టు చేశారు. చనిపోయిన మా బావ సత్తిరాజురెడ్డితో 2005 నుంచి మాకు ఎలాంటి సంబంధాలు లేవు. మా బావ వ్యసనాలకు గురై కుటుంబాన్ని పట్టించుకోలేదు. ఆయన గుండెపోటుతో చనిపోతే ఫోరెన్సిక్‌ నివేదికలో తప్పుడు వివరాలు చేర్చారు. అక్రమాలు బయటపెట్టినందు వల్లే ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి నన్ను ఇరికించారు. పోలీసులు అధికార పక్షానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం పనితీరుకు ఇదొక ఉదాహరణ. అక్రమ అరెస్టులకు భయపడేది లేదు. నా పోరాటం ఆగదు’’ అని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు శుక్రవారం అరెస్ట్టు చేసిన విషయం తెలిసిందే.  ఆయన స్వగ్రామం రామవరంలో హైకోర్టు న్యాయవాది శివారెడ్డి ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు కారణాలపై మాట్లాడడానికి రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డితోపాటు ఇతర అధికారులు నిరాకరించారు. తర్వాత సంతకం లేని ప్రెస్‌నోట్‌ను మీడియాకు విడుదల చేశారు. రామకృష్ణారెడ్డి బావ తేతలి సత్తిరాజురెడ్డి(60) మృతికి కారణం కావడంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు అందులో పేర్కొన్న విషయం తెలిసిందే. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని