మాజీ ఎమ్మెల్యే సుబ్బరాజు కన్నుమూత
close

తాజా వార్తలు

Updated : 16/04/2021 16:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాజీ ఎమ్మెల్యే సుబ్బరాజు కన్నుమూత

విజయవాడ: విజయవాడ పశ్చిమనియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, సీపీఐ సీనియర్‌ నేత కాకర్లపూడి సుబ్బరాజు (66) మృతి చెందారు. విజయవాడలోని తన నివాసంలో గుండెపోటుతో అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. సుబ్బరాజు భౌతికకాయాన్ని మార్చురీలో భద్రపరిచారు. అమెరికా నుంచి కుమారుడు, కుమార్తె వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బంధువులు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా, సీపీఐ, అనుబంధ సంఘాల్లో వివిధ హోదాల్లో సుబ్బరాజు సేవలందించారు. ఉమ్మడి ఏపీలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని