‘మా కుటుంబంపై భూమన కక్ష కట్టారు’
close

తాజా వార్తలు

Updated : 16/03/2021 21:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మా కుటుంబంపై భూమన కక్ష కట్టారు’

తెదేపా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కంటతడి

తిరుపతి: ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తమ కుటుంబంపై కక్ష కట్టారని తెదేపా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కంటతడి పెట్టారు. తిరుపతి నగర పాలక సంస్థ ఎన్నికల్లో 18వ డివిజన్‌ నుంచి పోటీ చేసిన తన మనవరాలు కీర్తిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌ చేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుగుణమ్మ మాట్లాడారు. 

కీర్తి విదేశాల్లో చదువుకుని వచ్చిందని.. తన తాతలాగే ప్రజలకు సేవ చేస్తానని రాజకీయాల్లో అడుగుపెట్టిందన్నారు. తిరుపతిలోనే పూర్తిస్థాయిలో ఉంటానని పేర్కొంటూ ఎన్నికల్లో దిగితే ప్రజల్ని ఎన్నుకోనివ్వరా? ఏంటీ దౌర్జన్యం? అని సుగుణమ్మ నిలదీశారు. తన రాజకీయ వారసురాలు కీర్తియేనని ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు. వైకాపాకు గట్టిపోటీ ఇవ్వడానికి ప్రజల ముందు ఉంచుతున్నానని సుగుణమ్మ చెప్పారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని