close

తాజా వార్తలు

Published : 19/10/2020 02:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కేయూ, ఓయూ పరిధిలో పలుపరీక్షలు వాయిదా

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కాకతీయ విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ మేరకు 19, 20వ తేదీల్లో జరగాల్సిన డిగ్రీ పరీక్షలను వాయిదా వేసి 20, 21వ తేదీల్లో నిర్వహించనుంది.  అలాగే యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన ఎంబీఐ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలను సైతం వాయిదా వేసింది. ఈ నెల 19, 20వ తేదీల్లో జరగాల్సిన ఎంబీఏ పరీక్షలను 21, 22వ తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 19, 20వ తేదీల్లో నిర్వహించాల్సిన బీఈడీ దూరవిద్య పరీక్షలను నవంబరు 2, 3వ తేదీల్లో జరపనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ని కాకతీయ విశ్వవిద్యాయం వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు స్పష్టం చేసింది.

ఈ నెల 19, 20, 21వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ నెల 22 నుంచి జరగాల్సిన పరీక్షలను యథాతథంగా జరుగుతాయని తెలిపింది. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని