రెప్పపాటులో ప్రమాదం.. రక్షించిన కానిస్టేబుల్‌
close

తాజా వార్తలు

Updated : 05/05/2021 17:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెప్పపాటులో ప్రమాదం.. రక్షించిన కానిస్టేబుల్‌

తిరుపతి: ఓ కానిస్టేబుల్‌ సమయోచితంగా వ్యవహరించి ఓ మహిళ ప్రాణాలు కాపాడాడు. రెప్పపాటులో ఆమెను ప్రమాదం నుంచి రక్షించాడు. ఈ ఘటన తిరుపతి రైల్వేస్టేషన్‌లో జరిగింది. తిరుమల ఎక్స్‌ప్రెస్‌ నుంచి తిరుపతి స్టేషన్‌లో దిగాల్సిన ఓ కుటుంబం నిద్రమత్తులో గమ్యస్థానాన్ని గమనించలేదు. రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరే క్రమంలో తేరుకొని హడావుడిగా రైలు దిగేందుకు ప్రయత్నించారు. ముందు ఓ యువతి రైలు నుంచి ప్లాట్‌ఫాం మీదకు దిగగా.. వెనకే మరో మహిళ కదులుతున్న రైలులోనుంచి దూకేందుకు యత్నించింది. అక్కడే విధుల్లో ఉన్న రైల్వే కానిస్టేబుల్‌ సతీశ్‌ దూరం నుంచే ఆమెను వారించారు. అయినా ఆ మహిళ రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించి కిందపడ్డారు. పట్టాలపై పడిపోబోతుండగా కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తితో కాపాడారు. ఆమె భర్తను కూడా కానిస్టేబుల్‌ ప్రమాదం నుంచి తప్పించారు. స్టేషన్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. దక్షిణ మధ్య రైల్వేశాఖ ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకొంది. కానిస్టేబుల్‌ సతీశ్‌ను ప్రశంసించింది.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని