TS NEWS: ఇంటర్‌ ఫలితాల వెల్లడికి కసరత్తు

తాజా వార్తలు

Published : 15/06/2021 20:00 IST

TS NEWS: ఇంటర్‌ ఫలితాల వెల్లడికి కసరత్తు

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల వెల్లడికి కసరత్తు జరుగుతోంది. ఫలితాల వెల్లడి కోసం అనుసరించాల్సిన విధివిధానాలను కమిటీ రూపొందించింది. కమిటీ సిఫార్సులతో కూడిన నివేదికను ఇవాళ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ప్రభుత్వానికి సమర్పించారు. 

మొదటి సంవత్సరం మార్కులను ప్రామాణికంగా తీసుకొని.. రెండో సంవత్సరం మార్కులు వేయాలని కమిటీ సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. కమిటీ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదిస్తే.. ఇంటర్‌ బోర్డు ఫలితాలను వెల్లడించనుంది. మార్కుల కేటాయింపు, అప్‌లోడ్‌ తదితర ప్రక్రియకు వారం, పది రోజులు పట్టే అవకాశం ఉందని ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు. జులై 1 నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించనున్నట్టు  ఇంటర్‌ బోర్డు కార్యదర్శి తెలిపారు. జులై 15 నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించాలని భావిస్తున్న ఇంటర్‌ బోర్డు.. ప్రవేశాలనుబట్టి తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. మరోవైపు ప్రైవేటు కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియలో స్తబ్దత కొనసాగుతోంది. సుమారు 70శాతం కళాశాలలు దరఖాస్తు చేసుకోలేదు. కొవిడ్‌ పరిస్థితుల కారణంగా ఫీజు తీసుకోకుండానే అనుమతి పునరుద్ధరించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. అయితే, ఉచితంగా గుర్తింపు ఇవ్వడం వీలు కాదని, ఈ ఏడాది ఫీజు పెంచకుండా గతేడాది రుసుముతో గుర్తింపు ఇవ్వాలని ఇంటర్‌ బోర్డు భావిస్తోంది. రేపో, ఎల్లుండో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి తుది నిర్ణయం తీసుకొనే అవకాశముంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని