close

తాజా వార్తలు

Published : 29/01/2021 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫేస్‌బుక్‌ ద్వారా సాయం: పేద కుటుంబానికి ఇల్లు

ధర్మపురి గ్రామీణం: ఫేస్‌బుక్‌.. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో పరిచయం అక్కర్లేని సామాజిక మాధ్యమం. మన నిత్య జీవనశైలిలో సామాజిక మాధ్యమాలు కూడా భాగమయ్యాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ మాధ్యమాలను సరైన రీతిలో వినియోగిస్తే కొంత మేలు చేయవచ్చని నిరూపించారు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలకు చెందిన ఓ సామాజిక కార్యకర్త. సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో ఆయన పెట్టిన పోస్టు ఓ కుటుంబానికి అండగా నిలవడమే కాకుండా ఇంటి రూపంలో నీడను కల్పించింది. 

వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన బోయిన శంకర్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేసేవాడు. ఆర్థిక కారణాలతో గత డిసెంబరులో శంకర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త చనిపోవడంతో ముగ్గురు పిల్లలతో బంధువుల ఇంట్లోనే శంకర్‌ భార్య భారతి అద్దెకుంటున్నారు. అయితే వారి దీనస్థితిని వివరిస్తూ ధర్మపురికి చెందిన సామాజిక కార్యకర్త రేణికుంట రమేష్ డిసెంబర్ 15న తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు పెట్టాడు. దీనిపై ‘ఎన్నారై ఫ్రెండ్స్‌’ అనే ఫేస్‌బుక్‌ గ్రూప్‌ మిత్రులు స్పందించి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. వారంతా కలిసి రూ.1,45,000 సేకరించి భారతి ఖాతాలో జమ చేశారు. వారితో పాటుగా అదే గ్రామానికి చెందిన కొంతమంది కలిసి రూ.38,000 సేకరించి భారతికి అందించారు. ఈ మొత్తం నగదుతో అన్ని సౌకర్యాలతో కూడిన ఇంటిని గ్రామస్థుల సాయంతో నిర్మించుకున్నారు. స్థానిక సీఐ రామచందర్‌రావు, గ్రామస్థుల చేతుల మీదుగా గురువారం గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇవీ చదవండి..

TS: ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

నిరుద్యోగులకు కేటీఆర్‌ శుభవార్త




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని