
తాజా వార్తలు
అంధుల కోసం ఫేస్బుక్ కొత్త అప్డేట్..
ఇంటర్నెట్ డెస్క్: ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ని పరిచయం చేస్తూ యూజర్స్‌కి మెరుగైన సేవలందిస్తోంది సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్. తాజాగా అంధులు, దృష్టి లోపం ఉన్నవారి సౌలభ్యం కోసం ఫేస్బుక్ తన ఏఐ ఆధారిత సేవల్లో కీలక మార్పులు చేసింది. గతంలో అంధులు ఫేస్బుక్ ఉపయోగిస్తుంటే ఫొటో వస్తే కేవలం ఫొటో అనే వర్డ్ వినిపించేంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏఏటీ (ఆటోమేటిక్ ఆల్టర్నేటివ్ టెక్ట్స్) సహాయంతో పనిచేస్తుంది. తాజాగా ఏఏటీని ఫేస్బుక్ అప్డేట్ చేసింది. ఈ కొత్త అప్డేట్తో ఫేస్బుక్లో ఫొటో కనిపిస్తే ఆ ఫొటోను వివరిస్తూ ఏఐ వాయిస్ వినిపిస్తుంది. అందులో ఏమేం ఉన్నాయి..అది దేనికి సంబంధించిన ఫొటో..ఫొటోలో ఎంత మంది ఉన్నారు..ఏ పొజిషన్లో ఉన్నారు ఇలా ప్రతి అంశాన్ని వివరిస్తూ వాయిస్ వస్తుంది. అలానే ఆ ఫొటో ఎక్కడ తీసుకున్నారు..ప్రదేశం వంటి వాటి గురించి కూడా పూర్తి వివరాలు తెలియజేస్తుంది. దీంతో అంధులు, దృష్టి లోపం ఉన్నవారు ఫొటోను సులభంగా అర్థం చేసుకుంటారని ఫేస్బుక్ తెలిపింది.
‘‘ఏఏటీ సరళమైన పదాలతో ఫొటో గురించి వివరిస్తుంది. సాధారణ వినియోగదారులు కూడా సులభంగా అర్థం చేసుకునేలా ఉంటుంది. ఇది 45 భాషల్లో సమాచారాన్ని అందిచగలదు’’ అని ఫేస్బుక్ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. అంతేకాదు తాజా అప్డేట్తో ఏఏటీ సుమారు 1,200 రకాల కాన్సెప్ట్‌లను ఫేస్బుక్, ఇన్స్టాగ్రాంలలో గుర్తించగలదు. వీటిలో ఆహారం, జాతీయ స్మారక చిహ్నాలతో పాటు పెళ్లి దుస్తులు, ఫొటోలు ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. దీని వల్ల సామాజిక మాధ్యమాల వినియోగం మరింత మంది చేరువవుతుందని ఫేస్బుక్ అభిప్రాయపడింది.
ఇవీ చదవండి..
వాట్సాప్‌లో ఈ సందేశాలు వచ్చాయా?
FBలో కొత్త ఫీచర్స్..లైక్ బటన్ ఉండదు..!