TS News: నకిలీ డీఎస్పీని అరెస్ట్‌ చేసిన పోలీసులు 

తాజా వార్తలు

Updated : 17/07/2021 18:47 IST

TS News: నకిలీ డీఎస్పీని అరెస్ట్‌ చేసిన పోలీసులు 

హైదరాబాద్‌: ఇంటర్ కూడా పాస్ కాలేదు కానీ డీఎస్పీ అని చెప్పుకున్నాడు. హంగూ ఆర్భాటంతో సకల వసతులు కల్పించుకున్నాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షలు వసూలు చేశాడు. సెటిల్ మెంట్లకు పాల్పడ్డాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాల్ పూర్ గ్రామానికి చెందిన నెల్లూరు స్వామిని పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ఐడీ కార్డులతో డీఎస్పీగా అవతారమెత్తిన స్వామి తన ముఠాతో కలిసి కోటి రూపాయల వరకూ వసూళ్లు చేశాడు. పలువురు బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన కామారెడ్డి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని