కుటుంబాన్ని బలిగొన్న కరోనా మహమ్మారి
close

తాజా వార్తలు

Updated : 19/08/2020 17:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కుటుంబాన్ని బలిగొన్న కరోనా మహమ్మారి

కొవ్వూరు: కరోనా మహమ్మారి ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. కుటుంబ యజమాని కరోనాతో మృతి చెందాడని భార్య, కుమారుడు, కుమార్తె మంగళవారం అర్ధరాత్రి గోదావరిలో దూకారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదలకు చెందిన నరసయ్య ఈనెల 16న కరోనాతో మృతిచెందాడు. కుటుంబ పెద్ద మరణించడంతో బంధువులు, సన్నిహితులు కనీసం పలకరించడానికి కూడా రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన సునీత(50), అమె కుమారుడు ఫణికుమార్ (25)‌, కుమార్తె అపర్ణ (23) ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

నరసయ్య వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడం వల్లే వారంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. రైల్వే బ్రిడ్జి పైనుంచి వీరు ముగ్గురూ గోదావరిలోకి దూకడంతో గల్లంతయ్యారు. గోదావరిలో వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలకు అంతరాయమేర్పడుతోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని