సెక్యూరిటీ కళ్లు గప్పి.. కోహ్లీని కలిసేందుకు 
close

తాజా వార్తలు

Published : 25/02/2021 12:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సెక్యూరిటీ కళ్లు గప్పి.. కోహ్లీని కలిసేందుకు 

నెట్టింట్లో వీడియో వైరల్‌

ఫొటో: బీసీసీఐ ట్విటర్‌

అహ్మదాబాద్‌: మొతేరా వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలిరోజు అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. సెక్యూరిటీ సిబ్బంది కళ్లు గప్పి ఓ అభిమాని మ్యాచ్‌ జరుగుతుండగానే మైదానంలోకి దూసుకొచ్చాడు. మూడో సెషన్‌లో కోహ్లీ(27), రోహిత్‌(57*) బ్యాటింగ్‌ చేస్తుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. కోహ్లీని కలిసేందుకు ఓ అభిమాని పిచ్‌పైకి పరుగెత్తుకుంటూ రావడంతో అంతా షాకయ్యారు. అది గమనించిన విరాట్‌.. అతడిని దూరం నుంచే రావొద్దని సైగలు చేశాడు. దాంతో ఆ అభిమాని కూడా కోహ్లీని కలవకుండానే వెనుదిరిగాడు.

ఈ క్రమంలోనే ఆట కాసేపు నిలిచిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ, రోహిత్‌ భారీ స్కోర్‌ సాధిచేలా కనిపించినా, చివరి ఓవర్‌లో కెప్టెన్‌ ఔటయ్యాడు. లీచ్‌ బౌలింగ్‌లో కోహ్లీ బౌల్డవ్వడంతో టీమ్‌ఇండియా 98 పరుగుల వద్ద మూడో వికెట్ నష్టపోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రహానె(1), రోహిత్‌తో కలిసి మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డాడు. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ 48.4 ఓవర్లలోనే 112 పరుగులకు ఆలౌటైంది. అక్షర్‌పటేల్‌ 6/38 అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని