close

తాజా వార్తలు

Updated : 24/01/2021 14:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వింత వ్యాధితో కౌలు రైతు మృతి!

దెందులూరు: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొమిరేపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతు కాలి ఏసుపాదం(65) మృతి చెందారు. పశువుల మేతకోసేందుకు పొలానికి వెళ్లిన ఏసుపాదం అస్వస్థతకు గురై అక్కడే ఉన్న పంటకాలువలో పడి చనిపోయారు. రైతు మృతి చెందిన విషయాన్ని గమనించిన ఆ మార్గంలో పొలానికి వెళ్తున్న ఓ వ్యక్తి గ్రామస్థులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. గ్రామంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్న వైద్యులు కౌలు రైతు మృతి చెందినట్టు నిర్ధరించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

కొద్ది రోజులుగా గ్రామంలో అంతుచిక్కని కారణాలతో పలువురు అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రైతు ఏసుపాదం మృతి చెందడం గ్రామంలో కలకలం రేపుతోంది. రైతు మృతికి అంతుచిక్కని వ్యాధి కారణమై ఉంటుందని గ్రామస్థులు భావిస్తున్నారు.  

ఇవీ చదవండి..
భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త మృతి

కొవిడ్‌ టీకా వేయించుకున్న ఆశా వర్కర్‌ మృతి



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని