రైలు కింద పడి కౌలు రైతు ఆత్మహత్య
close

తాజా వార్తలు

Updated : 14/12/2020 04:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రైలు కింద పడి కౌలు రైతు ఆత్మహత్య

గుంటూరు : అప్పుల బాధ తాళలేక కౌలు రైతు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. కాకుమాను మండలం పెద్దివారిపాలెంనకు చెందిన ముత్తవరపు శ్రీహరి 12 ఎకరాల్లో పత్తి, 2 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఇటీవల వచ్చిన నివర్‌ తుపాను కారణంగా రెండు పంటలు పూర్తిగా దెబ్బతినడంతో శ్రీహరి వాటిని ట్రాక్టర్‌తో తొలగించారు. పంట చేతికందకపోవడంతో రూ.6 లక్షల నష్టం వచ్చింది. పంట పెట్టుబడికి తీసుకొచ్చిన అప్పు ఎలా తీర్చాలో తెలియక మనస్థాపానికి గురైన శ్రీహరి మూడు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లి పోయినట్లు అతని బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలో శ్రీహరి ఆదివారం తెల్లవారుజామున బాపట్లలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

ఇవీ చదవండి.. 

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి

వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురి మృతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని