
తాజా వార్తలు
పెట్రోల్ పోసుకుని రైతు ఆత్మహత్య
చందర్లపాడు: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా చందర్లపాడు గ్రామంలో చోటు చేసుకుంది. కట్ట లక్ష్మీనారాయణ అనే రైతు పంట సాగు చేసి దిగుబడి రాక అప్పుల్లో కూరుకుపోయాడు. దీంతో మనస్తాపానికి గురైన రైతు నిన్న రాత్రి పొలానికి వెళ్లి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.
పొలానికి వెళ్లిన రైతు ఎంత సేపటికీ ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా లక్ష్మీనారాయణ మృతదేహం కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనపై మృతుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి..
నాన్నా... నన్నెందుకు చంపావ్?
Tags :