రైతుల ఆందోళన..రూ.50వేల కోట్ల నష్టం!
close

తాజా వార్తలు

Updated : 22/01/2021 04:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రైతుల ఆందోళన..రూ.50వేల కోట్ల నష్టం!

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దాదాపు రెండు నెలలుగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలతో దాదాపు రూ. 50వేల కోట్ల విలువైన వాణిజ్య నష్టం వాటిల్లినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) అంచనా వేసింది. అయితే, కొంతకాలం పాటు చట్టాల అమలును నిలిపివేస్తామని తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదన ప్రయోజనకరంగానే ఉందని పేర్కొంది.

నూతన వ్యవసాయ చట్టాలను ఒకటిన్నరేళ్లపాటు నిలుపుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదన న్యాయబద్ధమైనదని సీఏఐటీ సెక్రటరీ జనరల్‌ ప్రవీన్‌ ఖండేల్‌వాల్‌ పేర్కొన్నారు. ఇది సాగు చట్టాల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఈ పరిష్కార మార్గం సమంజసమైందేనని వెల్లడించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రైతు సంఘాలు ఈ ప్రతిపాదనకు అంగీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ రైతు సంఘాలు వీటికి అంగీకరించకపోతే, సమస్య పరిష్కారానికి రైతు సంఘాలు ఆసక్తి చూపడం లేదనే వాదనతో పాటు విభజన శక్తులు మరిన్ని సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిపాదించిన కమిటీలో వ్యాపార సంఘాలకు కూడా స్థానం కల్పించాలని సీఏఐటీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

ఇదిలాఉంటే, సాగు చట్టాలను కొంతకాలం పాటు నిలుపుదల చేస్తామని కేంద్రం కొత్త ప్రతిపాదన తీసుకొచ్చిన నేపథ్యంలో దీనిపై రైతు సంఘాలు తమ అభిప్రాయాలను రేపు జరగబోయే భేటీలో తెలిపే అవకాశం ఉంది. ఇదే సమయంలో దేశ రాజధానిలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీపై పోలీసులు కూడా చర్చలు జరుపుతూనే ఉన్నారు. రైతు సంఘాలతో దిల్లీ, హరియాణా, ఉత్తర్‌ ప్రదేశ్‌ పోలీసులు ఇప్పటికే పలుసార్లు సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..
సంప్రదింపులు ప్రారంభించిన సుప్రీం నిపుణుల కమిటీ!
సాగు చట్టాలను తాత్కాలికంగా నిలిపివేస్తాం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని