close

తాజా వార్తలు

Updated : 15/01/2021 15:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కేంద్రం-రైతు సంఘాల చర్చలు షురూ!

దిల్లీ: సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తోన్న రైతులతో కేంద్ర ప్రభుత్వం జరుపుతోన్న చర్చలు ప్రారంభమయ్యాయి. దిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరుగుతోన్న తొమ్మిదో విడత చర్చలకు రైతు సంఘాల తరపున 41 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యంగా నూతన వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకి చట్టబద్దత కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ముందుకు కూడా వెళ్లేది లేదని స్పష్టంచేస్తున్నాయి. ప్రభుత్వానికి, రైతులకు మధ్య చర్చల్లో కేంద్రమే విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నాయి. ఇలా ఓ వైపు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు పట్టుబడుతుండగా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టంచేస్తోంది. అయితే, రైతులకు అభ్యంతరం ఉన్న చట్టంలో మార్పులకు మాత్రం సిద్ధమని కేంద్రం చెబుతోంది. కేంద్రం దిగిరాకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ఈ రోజు చర్చల ఫలితాలపై ఆసక్తి నెలకొంది.

ఇదిలాఉంటే, వ్యవసాయ చట్టాలపై ఇప్పటికే సుప్రీం కోర్టు స్టే విధించగా, రైతులతో చర్చల కోసం ఏర్పాటుచేసిన నలుగురు సభ్యుల కమిటీ నుంచి భారతీయ కిసాన్‌ సంఘ(బీకేయూ) అధ్యక్షుడు భూపీందర్‌సింగ్‌ మాన్‌ తప్పుకున్న విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..
సాగు చట్టాలపై సుప్రీం స్టే
సుప్రీం కమిటీ నుంచి తప్పుకుంటున్నా..!




Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని