ఇంత బిల్లేస్తారా.. ప్రశ్నించిన వైద్యురాలి నిర్బంధం!
close

తాజా వార్తలు

Updated : 05/07/2020 13:17 IST

ఇంత బిల్లేస్తారా.. ప్రశ్నించిన వైద్యురాలి నిర్బంధం!

హైదరాబాద్‌: కరోనా చికిత్సకు అధిక బిల్లు ఎందుకు వేశారంటూ నిలదీసిన ఫీవర్‌ ఆస్పత్రి డీఎంవోను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి యాజమాన్యం నిర్బంధించింది. ఫీవర్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్‌ సుల్తానాకు ఈ నెల ఒకటో తేదీన కరోనా పాజిటివ్‌ రావడంతో ఆమె ఛాదర్‌ఘాట్‌లోని తుంబే ఆస్పత్రిలో చేరారు. ఆమెతో పాటు ఆమె సోదరి కూడా ఆస్పత్రిలో చేరారు.  అయితే, కరోనా చికిత్సకు 24 గంటలకే రూ .1.15 లక్షల బిల్లు వేశారు.  దీంతో ఆమె యాజమాన్యాన్ని నిలదీశారు.  తాను కూడా ప్రభుత్వ  వైద్యురాలినని, ఇంత బిల్లు ఎందుకు వేశారని ప్రశ్నించారు. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. తనను నిర్బంధించారంటూ వీడియోలో పేర్కొన్నారు.

అయితే, దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదూ రాలేదని, ఆదివారం వేకువ జామునే ఆమె ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారని ఛాదర్‌ఘాట్‌ పోలీసులు తెలిపారు. మరోవైపు ఫీవర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శంకర్‌ దీనిపై స్పందించారు. సుల్తానా తమ ఆస్పత్రిలో అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌గా పనిచేస్తున్నారని చెప్పారు. రెండు రోజుల కిందట కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చిందని వివరించారు. ఆస్పత్రి యాజమాన్యానికి చెప్పకుండానే ఆమె ప్రైవేటు ఆస్పత్రిలో చేరారని తెలిపారు. తమకు సమాచారం ఇచ్చి ఉంటే తామే మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకునే వాళ్లమని పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని