
తాజా వార్తలు
రాజమహేంద్రవరం జైలులో మరో 13 కరోనా కేసులు
రాజమహేంద్రవరం నేరవార్తలు: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కారాగారంలో మరో 13 మంది రిమాండ్ ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బుధవారం వీరికి జ్వరం రావడంతో జైలు అధికారులు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. గురువారం ఫలితాలు రాగా.. వీరికి వైరస్ సోకినట్లు జైలు సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు. గతంలో ఇదే కారాగారంలో 9 మంది ఖైదీలకు కొవిడ్ నిర్ధారణ అయింది. వీరితో పాటు ఈ 13 మంది ఖైదీలకు కారాగారంలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఖైదీల ఆరోగ్యం నిలకడగా ఉందని సూపరింటెండెంట్ వెల్లడించారు.
ఇవీ చదవండి
Tags :