జగిత్యాల, సిరిసిల్లలో 37 మందికి కరోనా
close

తాజా వార్తలు

Updated : 19/03/2021 16:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జగిత్యాల, సిరిసిల్లలో 37 మందికి కరోనా

వీరిలో 32 మంది బాలికలే

జగిత్యాల, కోనరావుపేట: రాష్ట్రంలోని విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో కొవిడ్‌ బారినపడుతోన్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని రెండు బాలికల పాఠశాలల్లో కలిపి 37 మందికి కరోనా సోకింది. వారిలో 32 మంది విద్యార్థినులు, ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో 200 మంది విద్యార్థినులు ఉన్నారు. అందులో 20 మంది గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో స్పందించిన పాఠశాల యాజమాన్యం వైద్య శిబిరం ఏర్పాటు చేసి కొవిడ్ పరీక్షలు చేయించారు. వారిలో 17 మంది బాలికలు, ఐదుగురు ఉపాధ్యాయులకు వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. వారిని వసతి గృహంలోనే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో..

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో 15 మంది విద్యార్థినులకు కరోన సోకింది. పాఠశాలలోని 6, 7, 8, 9 తరగతులకు చెందిన 62 మంది విద్యార్థినులకు కొవిడ్ టెస్టులు నిర్వహించారు. వారిలో 15 మంది బాలికలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని మండల వైద్యాధికారి మోహనకృష్ణ తెలిపారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థినులకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి ఐసోలేషన్‌లో ఉంచినట్లు చెప్పారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని