ఆ రాష్ట్రాల్లో జాతీయ సగటు కన్నా తక్కువ..
close

తాజా వార్తలు

Published : 09/01/2021 23:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ రాష్ట్రాల్లో జాతీయ సగటు కన్నా తక్కువ..

దిల్లీ: దేశ వ్యాప్తంగా మొత్తం 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా పాజిటివిటీ రేటు జాతీయ సగటు 5.79 శాతం కన్నా తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది.  ఈ క్రమంలో బిహార్‌లో అతి తక్కువగా 1.44 శాతం పాజిటివిటీ రేటు నమోదైందని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 9 లక్షల కరోనా పరీక్షలతో కలిపి దేశవ్యాప్తంగా 18 కోట్ల కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. కొవిడ్‌-19 పరీక్షలు చేయడానికి మౌలిక సదుపాయాలు పెరగడంతో దేశంలోని 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మెరుగైన స్థాయిలో పరీక్షలు చేస్తున్నారు.

ఇప్పటి వరకు భారత్‌లో 1201 ప్రభుత్వ, 1115 ప్రైవేట్‌ కరోనా పరీక్ష కేంద్రాలున్నాయి. దీంతో రోజువారీ పరీక్షా సామర్థ్యం గణనీయంగా పెరుగుతోంది. ఈ మధ్యనే కరోనా కేసులు పెరుగుతుండటంతో  కొన్ని రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరముందని సంబంధిత శాఖ వివరించింది.  శనివారం నాటికి భారతదేశంలో కరోనా రికవరీ రేటు అధిక స్థాయిలో పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఇవీ చదవండి..
టీకా వద్దని.. ఇప్పుడు ఆయనే కావాలంటూ!
90కి చేరిన యూకే రకం కేసులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని