ఏపీ హైకోర్టు న్యాయవాదుల మధ్య తోపులాట
close

తాజా వార్తలు

Updated : 08/04/2021 18:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీ హైకోర్టు న్యాయవాదుల మధ్య తోపులాట

అమరావతి: ఏపీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలపై చర్చించేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు న్యాయవాదుల మధ్య తోపులాట జరిగింది. దీంతో కొందరు కుర్చీలతో పరస్పరం దాడి చేసుకున్నారు.

ఈ క్రమంలో బార్‌ కౌన్సిల్ సభ్యుడు చలసాని అజయ్‌కుమార్ తలపై కుర్చీ తగలడంతో ఆయనకు గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగడంతో వివాదం సద్దుమణిగింది. జరిగిన ఘటనపై హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు వివరించాలని గాయపడిన న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని