పలమనేరులో తెదేపా, వైకాపా తోపులాట
close

తాజా వార్తలు

Updated : 03/03/2021 18:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పలమనేరులో తెదేపా, వైకాపా తోపులాట

పలమనేరు: పురపాలిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ విషయంలో వైకాపా, తెదేపా నేతలు ఘర్షణకు దిగారు. చిత్తూరు జిల్లా పలమనేరు పురపాలక సంఘం కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు వైకాపా నేతలు ప్రయత్నించారు. వైకాపా నేతలను అడ్డుకునేందుకు అక్కడే ఉన్న తెదేపా నేతలు ప్రయత్నించడంతో గొడవకు దారి తీసింది. నామినేషన్ల ఉపసంహరణలో అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెదేపా నాయకులు ఆరోపించారు. దీంతో మాటామాటా పెరిగి ఘర్షణ తీవ్రస్థాయికి చేరి పరస్పరం దాడి చేసుకునేంత వరకు వెళ్లింది.

ఈ క్రమంలో ఒక్కసారిగా తోపులాట జరగడంతో అక్కడే ఉన్న పోలీసులకు ఇరు వర్గాలను అదుపుచేయడం కష్టంగా మారింది. అయితే పోలీసులు తీవ్రంగా శ్రమించి ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినందున ఇతరులను పురపాలక సంఘ కార్యాలయంలోకి అనుమతించబోమని పోలీసులు హామీ ఇవ్వడంతో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. అనంతరం వైకాపా, తెదేపాకు చెందిన కార్యకర్తలు, నేతలను కార్యాలయం నుంచి దూరంగా పంపించారు. నామినేషన్ల గడువు ముగిసేసరికి పలమనేరు పురపాలికలోని 26 వార్డులకు 18 వార్డుల్లో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని