భువనగిరి పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం
close

తాజా వార్తలు

Published : 15/02/2021 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భువనగిరి పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం

భారీగా ఎగిసిపడుతున్న మంటలు

భువనగిరి: యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణ శివారులోని పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పారిశ్రామికవాడలోని ఓ ప్లాస్టిక్‌ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో మంటలు భారీగా ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న ఇతర పరిశ్రమలకు ఈ మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ సీఐ సుధాకర్‌ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి..

అరకు ప్రమాదం.. హైదరాబాద్‌కు‌ మృతదేహాలు

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం: 14 మంది మృతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని