దువ్వాడ సెజ్‌లో అగ్నిప్రమాదం
close

తాజా వార్తలు

Updated : 11/04/2021 20:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దువ్వాడ సెజ్‌లో అగ్నిప్రమాదం

దువ్వాడ: విశాఖ నగర పరిధి దువ్వాడలోని ‘విశాఖ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (వీఎస్‌ఈజడ్‌)’లో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. పూజా స్ర్కాప్‌ పరిశ్రమలో మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా పరిశ్రమలో మంటలు వ్యాపించినట్లు యాజమాన్యం తెలిపింది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ఏసీపీ శ్రీపాదరావు, సీఐ లక్ష్మి ఘటనాస్థలిని పరిశీలించారు. సుమారు రూ.కోటి ఆస్తి నష్టం వాటిల్లినట్లు పరిశ్రమ ఇన్‌ఛార్జ్‌ భానుప్రకాశ్‌ తెలిపారు.  



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని