close

తాజా వార్తలు

Updated : 10/05/2020 12:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విజయవాడ పండ్ల మార్కెట్‌లో అగ్నిప్రమాదం

విజయవాడ: నగరంలోని కేదారేశ్వరిపేటలో ఉన్న ఫ్రూట్‌ మార్కెట్‌లో  ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. భారీగా ఎగసిపడిన మంటలు చూసి వ్యాపారులు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. విద్యుదాఘాతం కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని