close

తాజా వార్తలు

Updated : 21/11/2020 12:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గుంటూరులో అగ్ని ప్రమాదం

గుంటూరు: నగరంలోని చేపలమార్కెట్‌ కాంప్లెక్స్‌లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాంప్లెక్స్‌లోని సూర్యా సెల్‌ఫోన్ల దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో దుకాణంలోని సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. పక్క షాపుల్లోకి మంటలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనపై లాలాపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెల్‌ఫోన్‌ దుకాణంలో ఉన్న రూ.9లక్షల విలువైన ఫోన్లు, సామగ్రి దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు. విద్యుదాఘాతం కారణంగానే ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు.Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన