Hyderabad: హైద‌ర్‌గూడలో అగ్నిప్ర‌మాదం
close

తాజా వార్తలు

Updated : 17/05/2021 08:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Hyderabad: హైద‌ర్‌గూడలో అగ్నిప్ర‌మాదం

హైద‌రాబాద్‌: న‌గ‌రంలోని హైద‌ర్‌గూడ అవంతిన‌గ‌ర్‌లోని ఓ ఇంట్లో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. మంట‌ల్లో చిక్కుకొని ఒక‌రు స‌జీవ‌ద‌హ‌నం కాగా.. న‌లుగురికి గాయాల‌య్యాయి. ఏసీ యంత్రంలో షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా మంట‌లు చెల‌రేగిన‌ట్లు తెలుస్తోంది. కుటుంబ స‌భ్యులు ఇంట్లో నిద్రిస్తుండ‌గా తెల్ల‌వారుజామున మంట‌లు వ్యాపించాయి. గ‌మ‌నించిన స్థానికులు అగ్నిమాప‌క సిబ్బంది, పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న సిబ్బంది కుటుంబాన్ని కాపాడి.. మంట‌ల‌ను ఆర్పేశారు. అగ్నిప్ర‌మాదంలో గౌరీనాథ్‌(38) అనే వ్య‌క్తి మృతిచెందిన‌ట్లు పోలీసులు తెలిపారు. క్ష‌త‌గాత్రుల‌ను స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు వివ‌రించారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని